తెలుగు భాషా దినోత్సవాన్ని పురస్కరించుకుని వైజాగ్‌లో జరిగిన ఒక ప్రతిష్టాత్మక కార్యక్రమంలో, తెలుగు సంస్కృతి, భాషాభివృద్ధికి విశేష కృషి చేసిన పలువురు ప్రముఖులను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సత్కరించింది. రాష్ట్ర పర్యాటక, సినిమాటోగ్రఫీ, సాంస్కృతిక శాఖల మంత్రి శ్రీ కందుల దుర్గేష్, అవనిగడ్డ ఎమ్మెల్యే, మాజీ డిప్యూటీ స్పీకర్ శ్రీ మండలి బుద్ధ ప్రసాద్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో సాంస్కృతిక కార్పొరేషన్ చైర్మన్ శ్రీమతి పొడపాటి తేజస్వి ని కూడా పాల్గొన్నారు. తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా వివిధ రంగాలలో తమ ప్రతిభను చాటిన 14 మంది కళాకారులు, రచయితలు, సాహితీవేత్తలకు పురస్కారాలు అందించారు.
శ్రీ నేలబోను సత్యం- తప్పెటగుళ్ళు జానపదం- శ్రీకాకుళం
శ్రీ పసుమర్తి శేషు బాబు- కూచిపూడి నాట్యం- కూచిపూడి
శ్రీ వల్లూరు సాంబశివ ప్రసాద్ - నాటక కళలు- గుంటూరు
శ్రీ యర్రాప్రగడ రామకృష్ణ- సాహిత్యం - రాజమండ్రి
శ్రీ పెరుగు రామ కృష్ణ- కవిత్వం- నెల్లూరు
శ్రీ చప్పిడి రాజశేఖర్ - సాంస్కృతిక సేవ- గుంటూరు
శ్రీమతి మండపాక శారద- శాస్త్రీయ సంగీతం- విశాఖపట్నం
శ్రీ గుడిసేవ విష్ణు ప్రసాద్ - సాహిత్యకవి- అవనిగడ్డ
ఆచార్య శ్రీ డి. మునిరత్నం నాయుడు- సాహిత్యం- చిత్తూరు
శ్రీచింతకిందిశ్రీనివాసరావు- రచయిత- విశాఖపట్టణం
శ్రీమాకినేనిసూర్యభాస్కర్- కళావిమర్శకులు- కాకినాడ
శ్రీదేవేంద్రపిళ్ళై-భరతనాట్యం- తిరుపతి
శ్రీపి.టి. మాధవ్- నాటకకళలు- విశాఖపట్టణం
శ్రీపల్లినల్లనయ్య- సాహిత్య కవి- శ్రీకాకుళం
వారందరికీ ఆంధ్రప్రవాసి తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు. సత్కారం అందుకున్న వారిలో ఒకరైన శ్రీ చప్పిడి రాజశేఖర్, తన సాంస్కృతిక సేవలకు గుర్తింపు పొందడం గర్వకారణం. పూర్తి వివరాలు, ఫోటోలు...